Perni Nani: కృష్ణా నది వరద ప్రాంతాల్లో అర్ధరాత్రి పర్యటించిన మంత్రి పేర్ని నాని

  • భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న కృష్ణమ్మ
  • ప్రకాశం బ్యారేజి నుంచి 9.40 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
  • సీఎం ఆదేశాలతో వరద ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల పర్యటన
Perni Nani visits flood affected areas in Krishna river villages

గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగిపొర్లుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు కైలా అనిల్, సింహాద్రి రమేశ్ గత అర్ధరాత్రి పర్యటించారు.  

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు 9.40 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రకాశం బ్యారేజి నుంచి అవనిగడ్డ వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని వెల్లడించారు.

అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి మండల గ్రామాలు, అవనిగడ్డ మండల గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని వివరించారు. ఆపై పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోనూ పర్యటించి రెవెన్యూ, పంచాయతీ, పోలీసు, నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశామని పేర్ని నాని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

More Telugu News