డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నాం.. పెళ్లి పనులు వరుణ్ చూసుకుంటున్నాడు: నాగబాబు

17-10-2020 Sat 12:49
  • నిహారిక పెళ్లి విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం
  • డిసెంబర్ లో పెళ్లి ఉంటుంది
  • త్వరలోనే  పెళ్లి తేదీని అందరికీ తెలియజేస్తాం
Niharikas marriage is a destination wedding says Nagababu

కొణిదెల వారి ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. నాగబాబు కుమార్తె నిహారిక వివాహం చైతన్యతో జరగబోతోంది. ఇటీవలే వీరి నిశ్చితార్థ కార్యక్రమం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్లపత్రికతో నాగబాబు మాట్లాడుతూ పెళ్లికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించారు.

నిహారిక పెళ్లి జరుగుతుండటంతో తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని నాగబాబు చెప్పారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను తన కుమారుడు వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడని చెప్పారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తున్నామని... డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని తెలిపారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కొన్ని ప్రాంతాల పేర్లతో వరుణ్ ఒక లిస్ట్ తయారు చేశాడని చెప్పారు. వివాహం జరిగే తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తామని అన్నారు.

మరోవైపు మెగా ఫ్యామిలీలో హీరో సాయి ధరమ్ తేజ్ కూడా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే సాయి తేజ్ పెళ్లికి సంబంధించి చిరంజీవి కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.