థాంక్యూ మహేశ్ బాబు సర్!: హీరోయిన్ కీర్తి సురేశ్

17-10-2020 Sat 11:01
keethy says thanks to mahesh
  • సర్కారు వారి పాటలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్
  • ట్వీట్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మహేశ్
  • తొలిసారి చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్న కీర్తి

'సరిలేరు నీకెవ్వరు'  వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మహేశ్ బాబు నటిస్తోన్న సినిమా 'సర్కారు వారి పాట' లో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటించనుందన్న విషయాన్ని మహేశ్ కన్ఫర్మ్ చేశాడు. ఈ రోజు కీర్తి సురేశ్ పుట్టినరోజు జరుపుకుంటోంది.

ఈ సందర్భంగా మహేశ్ ట్వీట్ చేస్తూ.. ‘గొప్ప టాలెంట్ ఉన్న కీర్తి సురేశ్‌కి జన్మదిన శుభాకాంక్షలు.. సర్కారు వారి పాట మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా మీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండి పోయే గొప్ప సినిమాగా నిలుస్తుంది’ అని పేర్కొన్నాడు.

మహేశ్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కీర్తి సురేశ్ పోస్టు చేసింది. ‘థాంక్యూ మహేశ్ బాబు సర్. తొలిసారి మీతో కలిసి పనిచేయనున్నందుకు సంతోషంగా ఉంది.. దీని కోసం ఎదురు చూస్తున్నాను’ అని రిప్లై ఇచ్చింది.

ఈ సినిమా నుంచి కీర్తి సురేశ్‌ని తప్పించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వాటన్నింటికీ మహేశ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. సోషల్ మెసేజ్‌తో కూడిన కథతో పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్,14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.