వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పని రౌడీని వెనకేసుకొచ్చిందెవరు?: విజయసాయిరెడ్డి

17-10-2020 Sat 10:44
vijaya sai slams chandrababu
  • మహిళల భద్రత గురించి బాబు మాట్లాడుతున్నారు
  • దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది 
  • రిషితేశ్వరి ప్రాణాలు తీసినవారిని కాపాడిందెవరు? 

ఆంధ్రప్రదేశ్ లో ‘దిశ’ పేరుతో పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి ఏడాదిన్నరగా డ్రామాలు ఆడుతున్నారని నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సైకోల పాలనలో ఏపీలో సైకోలు స్వైర విహారం చేస్తున్నారని, శాంతిభద్రతలు లోపిస్తే ఏం జరుగుతుందో విజయవాడలో ఓ యువతిని ప్రియుడు కిరాతకంగా హతమార్చడమే నిదర్శనమని విమర్శించారు. దీనిపై వైసీపీ అధినేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు.

‘మహిళల భద్రత గురించి బాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. తహసీల్దార్ వనజాక్షి గారిపై చింతమనేని దాడి చేస్తే ఆమెదే తప్పని రౌడీని వెనకేసుకొచ్చిందెవరు? బీటెక్ విద్యార్థిని రిషితేశ్వరి ప్రాణాలు తీసినవారిని కాపాడింది మీరు కాదా?’ అని విజయసాయిరెడ్డి నిలదీశారు.