దేశంలో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

17-10-2020 Sat 09:49
India reports a spike of 62212 new COVID19 cases
  • గత 24 గంటల్లో 62,212 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,32,681
  • మృతుల సంఖ్య 1,12,998
  • కోలుకున్న వారు 65,24,596 మంది  

దేశంలో గత 24 గంటల్లో 62,212 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 74,32,681 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 837 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,12,998 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 65,24,596 మంది కోలుకున్నారు. 7,95,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,32,54,017 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 9,99,090 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.