భారీ వర్షాల ఎఫెక్ట్.. చారిత్రక గోల్కొండ కోటలో కూలిన గోడ

17-10-2020 Sat 08:59
wall in golkonda fort collapsed due to heavy rains
  • భారీ వర్షాలకు నాని కూలిపోయిన గోడ
  • పర్యాటకులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • పది నెలల క్రితం ఇదే గోడపైన బురుజులకు మరమ్మతులు

నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నానిన చారిత్రక గోల్కండ కోటలోని ఓ గోడ కుప్పకూలింది. శ్రీజగదాంబిక అమ్మవారి ఆలయం ముందున్న 20 అడుగుల ఎత్తయిన గోడ కూలినట్టు అధికారులు తెలిపారు. పది నెలల క్రితం ఇదే గోడపై ధ్వంసమైన బురుజులకు మరమ్మతులు నిర్వహించారు. అప్పటికే ఈ గోడకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారినప్పటికీ దానిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు కురిసిన భారీ వర్షాలకు అది కాస్తా నాని కుప్పకూలింది. పర్యాటకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.