సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

17-10-2020 Sat 07:33
Tapsi completes her Tamil flick shoot
  • వరుస షూటింగుల్లో పాల్గొంటున్న తాప్సి 
  • ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్
  • హైదరాబాదులో విశాల్, ఆర్య మల్టీ స్టారర్  

*  కథానాయిక తాప్సి ధైర్యంగా షూటింగుల్లో పాల్గొంటోంది. తాజాగా తమిళ సినిమా 'అన్నాబెల్లె' షూటింగును పూర్తిచేసింది. దీని గురించి చెబుతూ, "భయపడుతూ కూర్చుంటే ఏమీ చేయలేము. అందుకే జాగ్రత్తలన్నీ తీసుకుని అన్నాబెల్లె షూటింగు పూర్తిచేశాము. ఇక 'హసీనా దిల్ రుబా' షూటింగ్ చేయాలి. ఆ తర్వాత 'రష్మీ రాకెట్', 'లూప్ లపేటా' సినిమాల షూటింగులలో పాల్గొంటా" అంటూ చెప్పుకొచ్చింది.
*  యంగ్ హీరో రామ్ కథానాయకుడుగా 'గరుడవేగా' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గతంలో ఓ చిత్రం ప్రారంభమై, ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని తిరిగి ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. స్క్రిప్టుకి దర్శకుడు కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో రామ్ తాజాగా దీనికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.  
*  విశాల్, ఆర్య కలసి ఓ చిత్రంలో  హీరోలుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఆనంద్ శంకర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.