హైదరాబాద్ అబిడ్స్ చర్మాస్ లో అగ్నిప్రమాదం

16-10-2020 Fri 20:59
Fire accident in Hyderabad Abids Chermas
  • చర్మాస్ నాలుగో అంతస్తులో అగ్నిప్రమాదం
  • భయంతో పరుగులు తీసిన సిబ్బంది, కస్టమర్లు
  • భారీగా ఆస్తి నష్టం ఉంటుందని అంచనా 

హైదరాబాదు, అబిడ్స్ లోని చర్మాస్ షోరూమ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. షోరూం నాలుగో అంతస్తులో మంటలు ఎగసిపడుతున్నాయి. ఈ ప్రమాదంతో భయాందోళనలకు గురైన కస్టమర్లు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణం నష్టం జరగలేదని భావిస్తున్నారు. ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉంటుందని అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.