Jagan: విశాఖ రాజధాని అంశాన్ని మరోసారి లేవనెత్తిన జగన్!

  • దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తర్వాత జగన్ వ్యాఖ్యలు
  • విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నామన్న జగన్
  • వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు రోడ్డు నిర్మాణం చేపట్టాలన్న సీఎం
Jagan speaks about Vizag capital

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ మరోసారి లేవనెత్తారు. విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ను ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వీకే సింగ్, రాష్ట్ర మంత్రి శంకర్ నారాయణ, ఎంపీలు కేశినేని నాని, సీఎం రమేశ్, కనకమేడల కూడా పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత కాన్ఫరెన్సులో జగన్ మాట్లాడుతూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీచ్ రోడ్ నుంచి భోగాపురం వరకు కోస్టల్ హైవేగా చేపట్టాలని కోరారు. ఐదు పోర్టుల అనుసంధానానికి నిధులు కేటాయించాలని అన్నారు.

More Telugu News