Narendra Modi: బీహార్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. 12 ర్యాలీల్లో పాల్గొననున్న మోదీ

  • అక్టోబర్ 23 నుంచి ప్రచారం నిర్వహించనున్న మోదీ
  • నాలుగు రోజుల్లో 12 ర్యాలీల్లో పాల్గొననున్న ప్రధాని
  • క్యాంపెయినర్ల జాబితాలో అమిత్ షా, రాజ్ నాథ్, యోగి, ఫడ్నవిస్
PM Narendra Modi likely to address 12 election rallies in Bihar

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నితీష్ కుమార్ పార్టీ జేడీయూతో బీజేపీ జతకట్టగా, తేజశ్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని కాంగ్రెస్ విమర్శిస్తున్న నేపథ్యంలో... ఈ ఎన్నికల్లో సత్తా చాటి విపక్షాల నోళ్లు మూయించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది.

మరోవైపు ప్రధాని మోదీ బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎన్నికల ర్యాలీలను ఆయన నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు. అక్టోబర్ 23, అక్టోబర్ 28, నవంబర్ 1, నవంబర్ 3న ఈ ర్యాలీలను నిర్వహించనున్నట్టు తెలిపారు.

మోదీ పాల్గొనబోతున్న ప్రచార ర్యాలీల వివరాలు ఇవే:

అక్టోబర్ 23: సాసారమ్, గయ, బాగల్పూర్
అక్టోబర్ 28: దర్బంగ, ముజఫర్ పూర్, పాట్నా
నవంబర్ 1: చహప్రా, తూర్పు చంపారణ్, సమస్తిపూర్
నవంబర్ 3: పశ్చిమ చంపారణ్, సహర్స, అరారియా

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో మోదీ పేరు తొలి స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆయనతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు.

More Telugu News