గులాం నబీ అజాద్ కు కరోనా పాజిటివ్

16-10-2020 Fri 17:02
Gulam Nabi Azad tests with Corona positive
  • తనకు కరోనా సోకిందని ప్రకటించిన అజాద్
  • హోం క్వారంటైన్ లో ఉన్నానని ప్రకటన
  • తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కరోనా ప్రొటోకాల్ పాటించాలని సూచన

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం క్యారంటైన్ లో ఉన్నానని తెలిపారు. కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా దయచేసి కోవిడ్ ప్రొటోకాల్ పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇప్పటికే పలువురు కీలక నేతలు కరోనా బారిన పడ్డారు. మన దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దాదాపు మరో 63 వేల కరోనా కేసులు నమోదయ్యాయి.