Sensex: నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

  • 255 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 82 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పుంజుకున్న టాటా స్టీల్
Sensex ends 255 points high

యూరప్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో నిన్న మన స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1,066 పాయింట్లు పతనమైంది. అయితే నిన్నటి భారీ కుదుపు నుంచి మార్కెట్లు ఈరోజు కోలుకున్నాయి. వారాంతంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 255 పాయింట్లు లాభపడి 39,983కి పెరిగింది. నిఫ్టీ 82 పాయింట్లు పుంజుకుని 11,762కి చేరుకుంది. ఈరోజు ఎనర్జీ సూచీ మినహా ఇతర అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (5.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.55%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (92.38%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.23%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.10%).

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-3.76%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.72%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.36%), ఏసియన్ పెయింట్స్ (-1.17%), నెస్లే (-1.02%).

More Telugu News