గతంలో చిరుతో మహేశ్, ప్రభాస్ ఫొటో.. ఇప్పుడు వైరల్!

16-10-2020 Fri 13:41
chiru with mahesh prabhas
  • ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’‌ సినిమా విడుదలై 16 ఏళ్లు
  • విజయం సాధించడంతో అప్పట్లో పార్టీ ఇచ్చిన మెగాస్టార్
  • చిరుతో సినీ ప్రముఖుల ఫొటో

జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన  ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’‌ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలై నిన్నటికి 16 ఏళ్లు అవుతున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఓ ఆసక్తికర ఫొటో వైరల్ అవుతోంది. సినిమా విజయవంతమైన సందర్భంగా ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన ఓ పార్టీలో పలువురు హీరోలు పాల్గొన్నారు.

వారిలో , సూపర్‌స్టార్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, హీరో శ్రీకాంత్‌, సుమంత్, తరుణ్,  సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, జయంత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు.