కరోనాను జయించిన తర్వాత ఫిట్ నెస్ వీడియో షేర్ చేసిన తమన్నా

16-10-2020 Fri 13:34
Milky Beauty Tamannaah shares her fitness video after recovered from corona
  • ఇటీవలే తమన్నాకు కరోనా
  • ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న మిల్కీ బ్యూటీ
  • వెంటనే ఫిట్ నెస్ సాధన షురూ

మిల్కీబ్యూటీ తమన్నా ఇటీవలే కరోనా బారినపడడం, ఆ వైరస్ ను జయించడం తెలిసిందే. తమన్నా ఓ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చి సెట్లోనే అస్వస్థతకు గురైంది. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ రావడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని ముంబయి వెళ్లిపోయింది. సాధారణంగా ఫిట్ నెస్ కు ఎంతో ప్రాధాన్యమిచ్చే తమన్నా కరోనాను జయించిన ఆనందంలో మళ్లీ తన ఫిట్ నెస్ సాధన వైపు అడుగులేసింది.

వార్మప్ ఎక్సర్ సైజులకు సంబంధించిన ఓ వీడియోను తమన్నా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. తన స్టామినా పుంజుకునేందుకు ప్రస్తుతం తాను తేలికపాటి వ్యాయామం మాత్రమే చేస్తున్నానని వెల్లడించింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఫిట్ నెస్ సంతరించుకోవడం చాలా ముఖ్యమని, వ్యాయామం తప్పనిసరి అని ఆమె పేర్కొంది. శరీరం చెప్పేది వింటూ ముందుకు పోతుండాలని సూచించింది.