అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాద వార్తలపై నాగార్జున స్పందన!

16-10-2020 Fri 12:49
 everything is absolutely fine says nag
  • ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం
  • మీడియాలో కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి
  • అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు
  • అంతా బాగానే ఉంది

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీనటుడు నాగార్జున స్పందించారు. ‘ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందంటూ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి. అయితే, అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు.. అంతా బాగానే ఉంది’ అని నాగార్జున ట్వీట్ చేశారు.

కాగా, అన్నపూర్ణ స్టూడియో కూడా  తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటికే దీనిపై ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో అంతా బాగానే ఉందని, నిర్ధారణ చేసుకోకుండా వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరుతున్నామని పేర్కొంది. నిన్న సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రం ఆగడం లేదు.