కేజీఎఫ్-2లో అధీరా పాత్రకు సిద్ధం.. మూడు ఫొటోలు పోస్ట్ చేసి ఆశ్చర్యపర్చిన సంజయ్ దత్

16-10-2020 Fri 12:36
Gearing up for Adheera Crossed swords KGFChapter
  • కొన్ని రోజుల క్రితం నీరసంగా కనిపించిన సంజయ్
  • ఇప్పుడు పాత సంజయ్ దత్‌లా మారిన వైనం 
  • కేజీఎఫ్‌-2లో నటించడంపై క్లారిటీ ఇచ్చిన సంజు

లంగ్‌ కేన్సర్‌ అడ్వాన్స్ డ్ స్టేజీలో ఉండడంతో చికిత్స తీసుకుంటోన్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. వాటిల్లో ఆయన సన్నగా, క‌ళ్లు లోప‌లికి పోయి, నీరసంగా కనిపించడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే, ఈ రోజు ఆయన తనకు సంబంధించిన మూడు ఫొటోలను పోస్ట్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. పూర్తిగా పాత సంజయ్ దత్‌లా మారిపోయిన ఆయనను చూస్తోన్న అభిమానులు ఆశ్యర్యపోతున్నారు.

ఇటీవల అభిమానుల్ని ఆందోళన‌కు గురిచేసిన సంజయ్‌ దత్‌ లుక్‌లకు భిన్నంగా ఈ ఫొటోలు ఉన్నాయి. ఆయనకు కేన్సర్ ఉందని తేలడంతో వాటిలో ఆయన సినిమాల్లో నటించే విషయంపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కన్నడ సినిమా కేజీఎఫ్‌-2లో ఆయన కీలకమైన అధీరా పాత్రలో నటించాల్సి ఉంది. అందులో ఆయన నటిస్తారా? లేదా? అన్న విషయంపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో అధీరా పాత్ర కోసం సిద్ధం అవుతున్నానని ఆయన ప్రకటించారు.