Lancet: చైనా వ్యాక్సిన్ తో సత్ఫలితాలు: లాన్సెట్ అధ్యయనం

  • వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత
  • స్వల్పంగా జ్యరం, ఒళ్లు నొప్పులు మాత్రమే
  • పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవన్న లాన్సెట్
China Vaccine Giving Results says Lancet

చైనాలో సీఎన్బీజీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తోందని ప్రముఖ మెడిసిన్ జర్నల్ లాన్సెట్ ప్రత్యేక అధ్యయనం పేర్కొంది. బీబీఐబీపీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవని, కొందరిలో మాత్రం జ్వరం, ఒళ్లు నొప్పులు మాత్రమే కనిపించాయని ఈ స్టడీ పేర్కొంది.

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి నిరోధకత పెరిగిందని సీఎన్బీజీ తెలియజేసింది. తమ అనుబంధ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రొడక్ట్స్ బీబీఐబీపీ - కోర్ వీ పేరిట ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచంలో మూడవ దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిన పది వ్యాక్సిన్ లలో బీబీఐబీపీ-కోర్-వీ కూడా ఒకటి.

More Telugu News