నిన్న రాత్రి ఏం జరిగిందంటే..: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్

16-10-2020 Fri 10:58
YSRCP MP Comments on Last Inght Incident
  • గురువారం రాత్రి ఘటన
  • కారును బైక్ తో ఢీకొట్టారు
  • అతను టీడీపీ కార్యకర్త పూర్ణచంద్రరావు
  • ట్విట్టర్ లో ఆరోపించిన నందిగం సురేశ్

గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేశ్ ప్రయాణిస్తున్న కారును ఓ బైక్ ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయమై, తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం స్పందించిన నందిగం, ఆ బైక్ ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్తదని, తనపై దాడికి అతను ప్రయత్నించాడని తెలిపారు.

"నిన్న రాత్రి వ్యక్తిగత పనుల మీద బయటకు వెళుతున్న సమయంలో   నా కారుకు  బైకు అడ్డంగా పెట్టి నాపై ఇష్టానుసారంగా అసభ్య పదజాలంతో దూషించి కారును బైక్ తో ఢీకొట్టి నాపై ఇనుప రాడ్ తో దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్త పూర్ణచంద్రరావు" అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.