కపోతాసనం వేసిన రకుల్ ప్రీత్ సింగ్!

16-10-2020 Fri 10:50
Rakul Kapotasanam Pic Goes Viral
  • ఫిట్ నెస్ పై శ్రద్ధ చూపే రకుల్
  • శరీర కండరాలను బలపరిచే ఆసనం
  • వైరల్ అవుతున్న ఇన్ స్టాగ్రామ్ ఫోటో

దక్షిణాది బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ఫిట్ నెస్ పై ఎంతో శ్రద్ధ పెడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె చేసే వ్యాయామాలు, యోగాకు సంబంధించిన ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో కనిపిస్తూ, ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటాయి. తాను సంపాదించిన డబ్బును కూడా జిమ్ కేంద్రాల్లో పెట్టుబడిగా రకుల్ పెట్టిందంటే, ఆమెకు శారీరక ఫిట్ నెస్ పై ఎంత మక్కువో అందరికీ తెలిసిందే.

తాజాగా ఆమె కపోతాసనం వేసి, ఆ చిత్రాన్ని తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఈ ఆసనాన్ని పెంగ్విన్ పోజ్ ఫోటో అని కూడా అంటుంటారు. ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల తొడలు, గజ్జల కండరాలు బలపడతాయి. పొత్తి కడుపు కండరాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. వెన్నెముక కూడా బలపడుతుందని యోగా నిపుణులు అంటున్నారు.