అగ్ని ప్రమాదం జరిగిందన్న ప్రచారంపై అన్నపూర్ణ స్టూడియో ప్రతినిధుల క్లారిటీ!

16-10-2020 Fri 10:38
Annapurna Studios Request to refrain from spreading unconfirmed news
  • అధికారిక ట్విట్టర్ ఖాతాలో అన్నపూర్ణ స్టూడియో వివరణ
  • స్టూడియోలో అంతా బాగానే ఉందని వ్యాఖ్య
  • నిర్ధారణ చేసుకోకుండా వార్తలు వ్యాప్తి చేయొద్దని వినతి 

అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆ స్టూడియో ప్రతినిధులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో దీనిని ఖండిస్తూ ఓ పోస్ట్ చేశారు. ‘అన్నపూర్ణ స్టూడియోలో అంతా బాగానే ఉంది. నిర్ధారణ చేసుకోకుండా వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరుతున్నాము’ అని పేర్కొన్నారు.

కాగా, ఆ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిన విషయానికి సంబంధించినవిగా ఉన్న వీడియో, పలు ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటల్ని ఆర్పివేశారని ప్రచారం జరిగింది. స్టూడియోలో షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ సంభవించి ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ఇదే..