ఫైట్స్ ప్రాక్టీస్ చేస్తున్న హీరోయిన్ కంగన.. విన్యాసాలు మామూలుగా లేవు.. వీడియో వైరల్!

16-10-2020 Fri 10:18
I have started action training
  • తదుపరి సినిమాలు తేజాస్, ధకాడ్ ల కోసం యాక్షన్ ట్రైనింగ్ 
  • ఈ సినిమాల్లో ఫౌజి, స్పై పాత్రల్లో కంగన
  • బాలీవుడ్ తనకు చాలా ఇచ్చిందన్న బ్యూటీ

హీరోయిన్ కంగనా రనౌత్ ఫైట్స్ చేయడం నేర్చుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ వీడియోలో ఆమె తీసుకుంటోన్న శిక్షణకు సంబంధించిన అన్ని విన్యాసాలను చూడొచ్చు. బాలీవుడ్ లో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో ఆమె వరుసగా నటిస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఇటువంటి సినిమాలే రెండు ఉన్నాయి. వాటి కోసం ఆమె ఇలా ఫైట్స్ నేర్చుకుంటోంది.

‘నా తదుపరి సినిమాలు తేజాస్, ధకాడ్ ల కోసం నేను యాక్షన్ ట్రైనింగ్ తీసుకోవడం ప్రారంభించాను. ఈ సినిమాల్లో నేను ఫౌజి, స్పై పాత్రల్లో నటించనున్నాను. బాలీవుడ్ నాకు చాలా ఇచ్చింది. మణికర్ణిక సినిమా విజయవంతం అయిన తర్వాత నేను కూడా బాలీవుడ్ కి మొట్టమొదటి సరైన యాక్షన్ హీరోయిన్ ను ఇచ్చాను’ అంటూ కంగనా రనౌత్ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.