దేశంలో కొత్తగా 63,371 కరోనా కేసులు

16-10-2020 Fri 09:55
India reports a spike of 63371 new COVID19 cases
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469 
  • మృతుల సంఖ్య 1,12,161
  • కోలుకున్న వారు 64,53,780 మంది
  • నిన్న ఒక్కరోజులోనే 10,28,622 కరోనా పరీక్షలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూనే ఉంది. భారత్‌లో గత 24 గంటల్లో 63,371 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 895 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,12,161 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 64,53,780 మంది కోలుకున్నారు. 8,04,528 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 9,22,54,927 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,28,622 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది