విద్యార్థుల కులమతాలు అడగని తొలి రాష్ట్రంగా ఏపీ... జగన్ కు సలాం: విజయసాయి రెడ్డి!

16-10-2020 Fri 09:20
No Caste and Religion for Students in AP Now
  • విద్యార్థి పేరు పక్కన కుల, మత ప్రస్తావన వద్దు
  • ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • కుల, మత రహిత సమాజానికి నాంది ఇదేనన్న విజయసాయి

ఇండియాలో కుల, మత భేదాలు లేని తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించిందని, ఇందుకు జగన్ కు సలాం చెబుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "కులమత భేదాలు లేని సమాజానికి తొలి అడుగు వేసిన ముఖ్యమంత్రి జగన్ గారి దూరదృష్టికి సలాం.... పాఠశాల హాజరు రికార్డుల్లో విద్యార్థులు కులం, మతం ప్రస్తావించకూడదని ఆదేశాలు జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఎందరో మహాత్ములు కలలు కన్న కుల మత రహిత సమాజానికి ఇది నాంది" అని అన్నారు.