హర్యానా ఉప ఎన్నికల్లో ఒలింపియన్ యోగేశ్వర్ దత్ ను రంగంలోకి దించిన బీజేపీ!

16-10-2020 Fri 08:24
Wrestler Yogeshwar is BJPs Candidate in By polls
  • బరోడా నుంచి బరిలోకి యోగేశ్వర్
  • నేటితో ముగియనున్న నామినేషన్లు
  • ఇంకా ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థి 

హర్యానాలోని బరోడా అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. రెజ్లర్ గా భారత ఖ్యాతిని జగద్విదితం చేసిన యోగేశ్వర్, ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

 నేటితో బరోడా ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగియనుండగా, గంటల ముందు బీజేపీ యోగేశ్వర్ పేరును ప్రకటించింది. కాగా, గత ఏప్రిల్ లో బరోడా ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత శ్రీకృష్ణ హూడా కన్నుమూయగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక కాంగ్రెస్ తరఫున ఎవరు బరిలోకి దిగుతారన్న విషయం అర్ధరాత్రి వరకూ తేలలేదు.