జూరాలకు 5 లక్షల క్యూసెక్కులు దాటిన వరద... 49 గేట్లు ఎత్తివేత!

16-10-2020 Fri 08:20
Heavy Flood in Krishna River
  • కర్ణాటకలో భారీ వర్షాలు
  • జూరాల నుంచి 6 లక్షల క్యూసెక్కుల విడుదల
  • ప్రకాశం బ్యారేజ్ మీదుగా సముద్రంలోకి

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదిలో మరోసారి వరద భారీ స్థాయికి పెరిగింది. జూరాల ప్రాజెక్టుకు 5.47 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. మొత్తం 49 గేట్లను అధికారులు తెరిచారు. ప్రస్తుతం జూరాలలో 5.699 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ఇక ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండుకుండల్లా మారగా, ఎగువ నుంచి వచ్చే నీటిని వచ్చినదాన్ని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి అధికంగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఏడున్నర లక్షల క్యూసెక్కులకు పైగా నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.