గుంటూరు జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురి మృతి

16-10-2020 Fri 08:14
4 dead in road accident in Guntur dist
  • రొంపిచర్ల-సుబ్బయ్యపాలెం వద్ద అదుపు తప్పిన కారు
  • తంగేడుమల్లి మేజర్ కాల్వలోకి దూసుకెళ్లిన వైనం
  • మృతులు ధర్మపురి వాసులుగా గుర్తింపు

గుంటూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు. బాధితులు ప్రయాణిస్తున్న కారు నార్కట్‌పల్లి-మేదరమెట్ల రహదారిపై రొంపిచర్ల-సుబ్బయ్య పాలెం మధ్య ఒక్కసారిగా అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్ కాల్వలోకి దూసుకెళ్లింది.

ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిని జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీసి నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.