సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

16-10-2020 Fri 07:19
Pooja Hegde signs one more film in Hindi
  • పూజ హెగ్డేకు హిందీలో మరో సినిమా 
  • తమిళ దర్శకుడితో చరణ్ 'ధృవ-2'
  • నిర్ణయాన్ని మార్చుకున్న మణిరత్నం  

*  ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు చేస్తూ బిజీగా వున్న కథానాయిక పూజ హెగ్డే హిందీలో సల్మాన్ ఖాన్ తో 'కభీ ఈద్ కభీ దివాళి' సినిమాలో నటిస్తోంది. తాజాగా హిందీలో మరో సినిమాకి ఓకే చెప్పింది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా రూపొందే చిత్రంలో ఓ కథానాయికగా పూజ నటిస్తుందట.  
*  తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. అయితే, గతంలో ఇది చరణ్ చేసిన 'ధృవ' చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతుందని అంటున్నారు. 'ధృవ' తమిళ మాతృకకు మోహన్ రాజానే దర్శకత్వం వహించగా, తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
*  ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రం షూటింగును ఈ నెలలో శ్రీలంకలో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజాగా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని, ఆలస్యమైనా షూటింగును ఇండియాలోనే నిర్వహిస్తారని తాజా సమాచారం.