అనారోగ్యంతో బాధపడుతున్న నటుడికి ఆసరాగా నిలిచిన సల్మాన్ ఖాన్

15-10-2020 Thu 22:11
Salman Khan helps ailing actor Faraaz Khan
  • బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  ఫరాజ్ ఖాన్
  • ఆసుపత్రి బిల్లులు చెల్లించిన సల్మాన్ ఖాన్
  • సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన కశ్మీరా షా

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఉదార స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆయన మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఏడాదిగా ఛాతీలో ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ, ఇటీవలే బెంగళూరు ఆసుపత్రిలో చేరిన నటుడు ఫరాజ్ ఖాన్ ఆసుపత్రి బిల్లులను సల్మాన్ చెల్లించారు. ఫరాజ్ ఖాన్ అక్టోబరు 8న బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో చేరాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఫరాజ్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

సల్మాన్ ఖాన్... ఫరాజ్ కు మరింత సాయపడేందుకు సిద్ధంగా ఉన్నారని నటి కశ్మీరా షా సోషల్ మీడియాలో తెలిపారు. ఫరాజ్ ఆసుపత్రి బిల్లులు చెల్లిస్తోంది సల్మానే అంటూ కశ్మీరా షా పోస్టు చేయడంతో భాయ్ ఉదారత వెల్లడైంది. ఫరాజ్ ఖాన్ 1998లో మెహిందీ అనే చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో రాణి ముఖర్జీ కూడా నటించింది.