పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్

15-10-2020 Thu 21:35
YS Vijayamma and Sharmila talks to Pilli Subhash Chandrabose
  • ఇటీవల పిల్లి సుభాష్ చంద్రబోస్ కు భార్యావియోగం
  • చికిత్స పొందుతూ కన్నుమూసిన పిల్లి సత్యనారాయణమ్మ
  • పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఫోన్ చేసిన వైఎస్ కుటుంబసభ్యులు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇటీవలే భార్యా వియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన భార్య సత్యనారాయణమ్మ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ ఫోన్ లో పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించారు.

పిల్లి సత్యనారాయణమ్మ మృతి పట్ల తమ సంతాపం తెలియజేశారు. ధైర్యంగా ఉండాలంటూ సుభాష్ చంద్రబోస్ కు సూచించారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబసభ్యులకు పిల్లి సుభాష్ చంద్రబోస్ కృతజ్ఞతలు తెలిపారు.