ట్విట్టర్లో నితిన్, సాయి తేజ్ సరదా సంభాషణ

15-10-2020 Thu 20:19
Nithin wishes his friend Saitej on birthday
  • నేడు సాయి తేజ్ బర్త్ డే
  • శుభాకాంక్షలు తెలిపిన నితిన్
  • పెళ్లి డేట్ ఎప్పుడంటూ కవ్వింపులు

మెగా హీరో సాయి తేజ్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సాయి తేజ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక, హీరో నితిన్, సాయి తేజ్ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ యువ హీరోల మధ్య ట్విట్టర్ లో నేడు ఆసక్తికర సంభాషణ నడిచింది. 'ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి సాయి తేజ్ డార్లింగ్' అంటూ నితిన్ ట్వీట్ చేశాడు.

"బ్రహ్మచారిగా ఇదే చివరి బర్త్ డే కాబట్టి బాగా గొప్పగా జరుపుకుంటావని ఆశిస్తున్నా. ఇంతకీ డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశావ్? అంటూ సాయి తేజ్ ను పెళ్లి గురించి కదిపాడు. అందుకు సాయి తేజ్ బదులిస్తూ... థాంక్యూ సో మచ్ డార్లింగ్ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. పెళ్లి డేట్ గురించి చెబుతూ... "నేనంత ఒత్తిడికి గురికాదల్చుకోలేదు, ఇంట్లో వాళ్లు ఎప్పుడంటే అప్పుడే!" అంటూ తేల్చి చెప్పాడు.