Sanjay Dutt: కొత్త హెయిర్ కట్, కొత్త ఉత్సాహం... త్వరలోనే క్యాన్సర్ ను జయిస్తానని సంజయ్ దత్ ధీమా

Sanjay Dutt spotted at Aalim Hakim saloon says he will beat cancer
  • క్యాన్సర్ తో పోరాడుతున్న సంజయ్ దత్
  • ఇటీవలే విదేశాల్లో చికిత్స
  • తాజాగా బ్యూటీ సెలూన్ లో దర్శనమిచ్చిన నటుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఇటీవలే క్యాన్సర్ బారినపడ్డారు. విదేశాల్లో చికిత్స అనంతరం కొన్నిరోజుల కిందట భారత్ వచ్చారు. 'ఎయిర్ పోర్టులో సంజయ్ దత్' అంటూ ఫొటోలు రాగా, వాటిలో బాగా నీరసించిన స్థితిలో ఉన్న సంజూను చూసి అభిమానులు చాలా బాధపడ్డారు. అయితే తాజాగా ఓ బ్యూటీ సెలూన్ లో ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపించారు. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ తో హెయిర్ కట్ చేయించుకుని కొత్త క్రాఫుతో ఉల్లాసంగా దర్శనమిచ్చారు.

దీనిపై స్పందిస్తూ, మళ్లీ సెలూన్ కు రావడం ఆనందాన్నిస్తోందని అన్నారు. క్యాన్సర్ తన జీవితంలో ఓ బాధాకరమైన అంశమని, అయితే దాన్ని తాను జయిస్తానని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే క్యాన్సర్ నుంచి కోలుకుని బయటపడతానని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరిని ఆకట్టుకుంటోంది.

Sanjay Dutt
Hair Cut
Aalim Hakim
Saloon
Cancer
Bollywood

More Telugu News