జీహెచ్ఎంసీ కమిషనర్ పై కిషన్ రెడ్డి ఆగ్రహం

15-10-2020 Thu 16:34
Kishan Reddy fires on GHMC Commissioner
  • భారీ వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్
  • లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి
  • పర్యటనకు దూరంగా ఉన్న జీహెచ్ఎంసీ అధికారులు

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు.

అయితే ఆయన పర్యటన సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులు దూరంగా ఉన్నారు. దీంతో, కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కు ఫోన్ చేశారు. కనీసం డీఈ, ఏఈ స్థాయి అధికారులను పంపించకపోవడం సరికాదంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు రాకపోతే తాను వివరాలను ఎలా తెలుసుకోగలనని ప్రశ్నించారు.