Kumaraswamy: బెంగళూరుకు కాంగ్రెస్ సురక్షితం కాదు: కుమారస్వామి

Congress Not Safe For Bengaluru says HD Kumaraswamy
  • కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య పేలుతున్న మాటలు తూటాలు
  • రాజరాజేశ్వరినగర్ ఉపఎన్నికలో పోటీ పడుతున్న ఇరు పార్టీలు
  • కాంగ్రెస్ విషయం అందరికీ అర్థమైందన్న కుమారస్వామి
మొన్నటి దాకా కర్ణాటకలో అధికారాన్ని పంచుకున్న జేడీఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగళూరులోని రాజరాజేశ్వరినగర్ శాసనసభ ఉపఎన్నిక నేపథ్యంలో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. ఈ నేపథ్యంలో, ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా జేడీఎస్ అధినేత కుమారస్వామి మాట్లాడుతూ కర్ణాటకకు, బెంగళూరుకు కాంగ్రెస్ పార్టీ సురక్షితం కాదని అన్నారు.

ఇటీవల బెంగళూరులో అల్లర్లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇంటికి నిప్పు పెట్టిన తర్వాత అల్లర్లు జరిగాయి. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంది. దీనిపై కుమారస్వామి మాట్లాడుతూ, ఇప్పుడు అసలు విషయం అందరికీ అర్థమవుతోందని... బెంగళూరుకు కాంగ్రెస్ సురక్షితం కాదనే విషయం ఓటర్లకు అర్థమైందని అన్నారు. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓటర్లు సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Kumaraswamy
JDS
Congress
Bengaluru

More Telugu News