టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్

15-10-2020 Thu 13:28
TTD Chairman SV Subba Reddy tests with Corona positive
  • కోవిడ్ పరీక్షల్లో సుబ్బారెడ్డికి కరోనా పాజిటివ్
  • ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారెడ్డి  
  • ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం

కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తితో కొలుచుకునే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం కూడా కరోనా వల్ల మూతపడిన సంగతి తెలిసిందే. అయితే అన్ లాక్ ప్రక్రియలో భాగంగా తిరుమల ఆలయం మళ్లీ తెరుచుకుంది. ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... ఆలయ అర్చకులు, జీయర్లు, టీటీడీ అధికారులు కూడా కరోనా బారిన పడ్డారు.

తాజాగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డిని ముఖ్యమంత్రి జగన్ టీటీడీ ఛైర్మన్ గా నియమించారు.