పేకమేడలా కూలిన పాత భవంతి... త్రుటిలో తప్పించుకున్న హైదరాబాద్ మహిళ... వీడియో ఇదిగో!

15-10-2020 Thu 09:31
Womens Narrow Escape Recorded in CCTV
  • మొఘల్ పురా సమీపంలో ఘటన
  • కుప్పకూలిన పాత భవంతి
  • పరుగు పెట్టడంతో తప్పిన ప్రమాదం

హైదరాబాద్, మొఘల్ పురా ప్రాంతంలో అమర్చిన ఓ సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఓ మహిళ నడుస్తూ వస్తుండగా, ఓ పాత భవనం పేకమేడలా కుప్పకూలింది. సరిగ్గా ఆ భవనం వద్దకు మహిళ రాగానే, అది పడిపోయింది.

ప్రమాదాన్ని గమనించిన ఆమె, వేగంగా పరుగు పెట్టింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. భవనం కూలడంతో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. కాగా, గత కొన్ని రోజులుగా నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండగా, బుధవారం పగటి పూట మాత్రం వర్షం కురవలేదు.