సమంత సినిమా నుంచి తప్పుకున్న దర్శకుడు?

14-10-2020 Wed 21:22
Director changed in Samanthas film
  • అశ్విన్ శరవణన్ తో సమంత సినిమా
  • ఫిజికల్లీ చాలెంజ్డ్ పాత్రలో సమంత
  • ప్రాజక్టు నుంచి తప్పుకున్న అశ్విన్  
  • కొత్తగా ప్రాజక్టులోకి నందిని రెడ్డి

ఒక ప్రాజక్టులోంచి హీరో హీరోయిన్లు మారడం.. లేకపోతే డైరెక్టర్ మారడం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. ఇది సినీ పరిశ్రమలో సాధారణంగా జరిగేదే. దీనికి రకరకాల కారణాలుంటాయి. ప్రస్తుతం అందాల కథానాయిక సమంత సినిమా విషయంలో కూడా అలాంటి మార్పే జరిగినట్టు తెలుస్తోంది.

సమంత ప్రధాన పాత్రధారిణిగా తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఓ సినిమా నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఇందులో సమంత ఫిజికల్లీ చాలెంజ్డ్ అమ్మాయి పాత్రను పోషించనున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఆ పాత్ర కోసం ఆమె శిక్షణ కూడా తీసుకుంటోందని అన్నారు.

ఆయితే, ప్రస్తుతం ఈ ప్రాజక్టు నుంచి దర్శకుడు అశ్విన్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. కారణాలు వెల్లడికాలేదు కానీ, ఈ ప్రాజక్టులోకి దర్శకురాలిగా నందినీ రెడ్డి ఎంటర్ అయినట్టు చెబుతున్నారు. సోనీ పిక్చర్స్ నిర్మించే ఈ చిత్రం కథ కూడా మారిందా? లేక అదే కథతో చిత్ర నిర్మాణం సాగిస్తారా? అన్నది ఇంకా తెలియరాలేదు.