ట్విట్టర్, ఇన్స్టా ఖాతాలను డిలీట్ చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి!

14-10-2020 Wed 21:12
Sushant singhs sister Swetha deleates her Twitter and Instagram accounts
  • సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే శ్వేత   
  • ఫేస్ బుక్ ఖాతాను మాత్రం కొనసాగిస్తున్న వైనం
  • సోషల్ మీడియా ద్వారా పోరాటం చేస్తున్న శ్వేత

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడిన వెంటనే ఆమె తన కుటుంబం తరపున పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ముఖ్యంగా హీరోయిన్ రియా చక్రవర్తిని ఆమె తీవ్రంగా టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా ఉండే ఆమె... అదే వేదికగా సంచలన ఆరోపణలు చేశారు.

అయితే ఏ కారణం వల్లో కానీ... సోషల్ మీడియా నుంచి అర్ధాంతరంగా ఆమె వైదొలిగారు. తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేశారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఫేస్ బుక్ ఖాతాను మాత్రం ఆమె కొనసాగిస్తున్నారు.

ఇదిలావుంచితే, బాలీవుడ్ డైరెక్టర్ దినేశ్ కార్యాలయం, నివాసంపై ఈరోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. 2016లో 'రబ్తా' చిత్రానికి సంబంధించి సుశాంత్ కు చేసిన చెల్లింపులపై దర్యాప్తు చేస్తోంది.