కేసీఆర్, జగన్ లతో మాట్లాడాను: తెలుగులో మోదీ ట్వీట్

14-10-2020 Wed 20:44
Centre will help Telangana and AP says Modi
  • వరద పరిస్థితిపై ఇద్దరు సీఎంలతో మాట్లాడాను
  • కేంద్రం అన్ని విధాలా సాయం అందిస్తుంది
  • వరద బాధితుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నా

ఇరు తెలుగు రాష్ట్రాలు వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణికిపోయాయి. ప్రాణ నష్టంతో పాటు భారీ స్థాయిలో ఆస్తి నష్టం సంభవించింది. వర్షం ఆగితే కానీ ఎంత నష్టం జరిగిందనే విషయాన్ని అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. వరద సహాయక చర్యల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికార యత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ప్రధాని మోదీ అభయమిచ్చారు. ట్విట్టర్ ద్వారా ఆయన తెలుగులో స్పందిస్తూ, 'భారీ వర్షాల వల్ల ఉత్పన్నమైన పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, ఏపీ మఖ్యమంత్రి జగన్ గారితో నేను మాట్లాడాను. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందిస్తుందని హామీ ఇవ్వబడింది. వర్ష బాధితుల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను' అని చెప్పారు.