శోభానాయుడు లేరని తెలిసి ఎంతో బాధకు గురయ్యాను: చిరంజీవి

14-10-2020 Wed 19:19
Chiranjeevi pays tributes to Shobha Naidu
  • తన సాంస్కృతిక వారసత్వాన్ని ఎందరికో పంచారు
  • తన జీవితాన్ని కూచిపూడికే అంకితం చేశారు
  • ఆమెతో నాకు వ్యక్తిగతంగా అనుబంధం ఉంది

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు. ఆమె మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తన జీవితాన్ని కూచిపూడికే అంకితం చేసిన గొప్ప కళాకారిణి అని ప్రశంసించారు. ఆమె ఇక లేరని తెలిసి ఎంతో బాధకు గురయ్యానని చెప్పారు.

ఆమె లేని లోటు మనతో పాటు సాంస్కృతిక సమాజానికి తీరని లోటు అని అన్నారు. శ్రీ వెంపటి చిన సత్యంగారి శిష్యురాలిగా ఆయన వారసత్వాన్ని ఎంతో ఘనంగా కొనసాగించారని కితాబునిచ్చారు. తన సాంస్కృతిక వారసత్వాన్ని ఎందరికో పంచారని... ఎందరో కూచిపూడి నృత్యకారులను తయారు చేశారని కొనియాడారు. శోభానాయుడు గారితో తనకు వ్యక్తిగతంగా ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.