గుంటూరు జిల్లాలో అగ్ని ప్రమాదం.. కెమికల్ ఫ్యాక్టరీలో ఎగసిపడుతున్న మంటలు!

14-10-2020 Wed 17:27
Fire accident in Guntur Dist chemical factory
  • దాచేపల్లి మండలం ఇరికేపల్లి కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం
  • 10 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించిన దుర్వాసన
  • ప్రమాదస్థలికి చేరుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో మరో అగ్నిప్రమాదం సంభవించింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న మెటీరియల్ రూమ్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదనే తెలుస్తోంది.

 మరోవైపు, ప్రమాదం విషయం తెలిసిన వెంటనే దాచేపల్లి రెవెన్యూ, పోలీస్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. మంటల కారణంగా దాదాపు 10 కిలోమీటర్ల దూరం వరకు దుర్వాసన వ్యాపించింది. భారీగా వెలువడుతున్న కెమికల్స్ పొగవల్ల ఇబ్బందులు తలెత్తుతాయేమోనని స్థానికులు భయపడుతున్నారు.