Chandrababu: భారీ వర్షాల నేపథ్యంలో జగన్ కు చంద్రబాబు లేఖ

Chandrababu writes letter to Jagan amid heavy rains
  • మృతుల కుటుంబాలను ఆదుకోండి
  • దెబ్బతిన్న పంటకు నష్ట పరిహారం చెల్లించండి
  • కౌలు రైతులను ఆదుకోండి
భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలం అవుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వర్షాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారని... వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని లేఖలో కోరారు. దెబ్బతిన్న పంటలకు కూడా నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

వర్షం వల్ల దెబ్బతిని, రంగు మారిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించి, ప్రభుత్వమే కొనాలని పేర్కొన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన కౌలు రైతులను ఆదుకోవాలని అన్నారు. ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు, ఎరువులను ఉచితంగా అందించాలని కోరారు.  

దెబ్బతిన్న పడవలు, వలలు మరమ్మతులకు ఆర్థిక సాయం అందించాలని, కూలిపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను మంజూరు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వాగులు, వంకలకు పడిన గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అన్నారు. దెబ్బతిన్న రోడ్లు, రహదారులను మరమ్మతు చేయాలని కోరారు.
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
letter

More Telugu News