K Kavitha: బాలికపై దొంగబాబా అత్యాచారం... ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం!

Kavitha fires on fake baba rape on a girl
  • నిజామాబాద్ లో దొంగబాబా అరాచకం
  • కర్కోటకుడికి బుద్ధి వచ్చేలా చేయాలన్న కవిత
  • కఠినంగా శిక్షించాలని ఆదేశం
తెలుగు రాష్ట్రాల్లో దొంగబాబాల దారుణాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వైద్యం పేరుతో ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో దొంగబాబా. ఈ ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. ఆమెపై దారుణం జరిగినట్టు తెలవడంతో దొంగబాబాపై బాధితురాలి తల్లిదండ్రులు దాడి చేసి, దేహశుద్ధి చేశారు.

ఈ ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన కర్కోటకుడికి బుద్ధి వచ్చేలా చేయాలని అన్నారు. దొంగబాబాను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.

మరోవైపు కవిత ఆదేశాలతో బాధితురాలిని నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సుమనా రెడ్డి పరామర్శించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మరో వైపు ఈ దారుణ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన మరోసారి చోటుచేసుకోకుండా దొంగబాబాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
K Kavitha
Nizamabad
Baba
Rape

More Telugu News