Chandrababu: అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారు: చంద్రబాబు లేఖలపై ఏపీ డీజీపీ కీలక వ్యాఖ్యలు

AP DGPs response on Chandrababus letters
  • విచారణ జరిపితే అవాస్తవాలని తేలుతోంది
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి
  • దేవాలయాలపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకున్నాం

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు రాస్తున్న లేఖలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవాస్తవాలతో లేఖలు రాస్తున్నారని... విచారణ జరిపితే ఆరోపణలు అవాస్తవాలని తేలుతోందని చెప్పారు. రాజకీయ అజెండాతో లేఖలు రాస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసేలా చర్యలను చేపట్టామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని అన్నారు. హిందూ దేవాలయాలపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వాళ్లపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News