శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ పై రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతా: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

14-10-2020 Wed 14:28
Red sandal smuggling increased in recent time says Kishan Reddy
  • కిషన్ రెడ్డిని కలిసిన ఏపీ బీజేపీ నేతలు
  • ఎర్రచందనం స్మగ్లింగ్ పై వినతిపత్రం
  • చర్యలకు ఆదేశిస్తామని హామీ 

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. యథేచ్చగా స్మగ్లింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని ఏపీ బీజేపీ నేతలు భానుప్రకాశ్, రమేశ్ నాయుడు కలిశారు.

శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ తరలింపుపై వినతిపత్రం ఇచ్చారు. తిరుమలలో ఎర్రచందనాన్ని కాపాడాలని కోరారు. కొందరు నేతలు స్మగ్లర్లతో కుమ్మక్కై కోట్ల రూపాయల చందనాన్ని విదేశాలకు తరలిస్తున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చర్యలకు ఆదేశిస్తామని హామీ ఇచ్చారు.