జడ్జీలపై సీఎం కంప్లయింట్ పెట్టిన రోజు నుంచి విజయసాయిరెడ్డి మైకు ముందుకు రావడం లేదు: బుద్ధా వెంకన్న

14-10-2020 Wed 13:09
Vijayasai Reddy is silent after Jagans complaint on judges says Budda Venkanna
  • ట్విట్టర్లో కూత పెట్టే పక్షి మౌన వ్రతం పాటిస్తోంది
  • చిట్టి గుండె, చిన్న మెదడు వణుకుతున్నాయా?
  • జగన్ ఫిర్యాదులకు విజయసాయి అనుకూలమా?

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సహా విపక్ష నేతలను ఆయన ట్విట్టర్ ద్వారా తీవ్రంగా విమర్శిస్తుంటారు. విజయసాయి ట్వీట్లపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తుంటారు. తాజాగా విజయసాయిని వెంకన్న మరోసారి టార్గెట్ చేశారు.

జడ్జీలపై ముఖ్యమంత్రి జగన్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి విజయసాయిరెడ్డి మైకు ముందుకు రావడమే మానేశారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ఏం జరిగినా 'జై జగన్' అంటూ ట్విట్టర్లో కూత పెట్టే పక్షి ఇప్పుడు మౌన వ్రతం పాటిస్తోందని అన్నారు. చిట్టి గుండె, చిన్న మెదడు భయంతో వణుకుతున్నాయా? అని ప్రశ్నించారు. ఇంతకూ జగన్ చేసిన ఫిర్యాదులకు విజయసాయిరెడ్డి అనుకూలమా? లేక వ్యతిరేకమా? నోరు తెరిచి చెప్పండని డిమాండ్ చేశారు.