గంగవ్వ వెళ్లిపోయిందంటూ... బోరున విలపించిన క్యూట్ బాయ్... వైరల్ వీడియో!

14-10-2020 Wed 07:30
boy Crying for Gangavva goes Viral
  • గత వారాంతంలో వెళ్లిపోయిన గంగవ్వ
  • లక్షలాది మంది అభిమానులకు షాక్
  • బిగ్ బాస్ ఇక చూడనంటూ చిన్నారి ఏడుపు

టాలీవుడ్ అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-4 రసవత్తరంగా సాగుతున్న వేళ, హౌస్ లో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ, గత శనివారం అనారోగ్య కారణాలతో బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే.

దీంతో గంగవ్వ చివరి వరకూ ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది అభిమానులు షాక్ నకు గురికాగా, ఓ ఆరేడేళ్ల చిన్నారి, గంగవ్వ, బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ముద్దులొలికే ఈ చిన్నారి గంగవ్వ కోసం ఏడుస్తూ, 'బిగ్ బాస్ ఇక చూడను... నాకు వద్దు' అని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తల్లి ఓదారుస్తున్నా సమాధానపడకుండా, గంగవ్వ కోసం ఏడుస్తున్న ఆ చిన్నారి వీడియోను మీరూ చూడవచ్చు.