Dasara: ఏపీలో దసరా సందర్భంగా స్పెషల్ బస్సులు.. హైదరాబాదు రూట్ మినహా!

Above 2000 Special Busses Announced for Dasara Season
  • తెలంగాణతో ఇంకా కుదరని ఒప్పందం
  • హైదరాబాద్ రూట్ ను పక్కనబెట్టిన ఏపీ
  • అవసరమైతే మరిన్ని బస్సులు తిప్పుతామన్న అధికారులు
ఈ దసరా పండగ సీజన్ లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మొత్తం 2,028 ప్రత్యేక బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఇవన్నీ రాష్ట్ర పరిధిలోని వివిధ పట్టణాల మధ్య తిరిగేవే కావడం గమనార్హం. తెలంగాణలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం కుదరనందున, భారీగా డిమాండ్ ఉండే హైదరాబాద్ రూట్ లో మాత్రం బస్సులను ప్రకటించలేదు.

ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి, అవసరమైతే మరిన్ని బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఆపరేషన్స్  విభాగం ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. అందుకు తగినట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
Dasara
APSRTC
Special Busses

More Telugu News