పిల్లి సుభాష్ చంద్రబోస్ కు సీఎం జగన్ ఫోన్... ఆత్మీయ పరామర్శ!

13-10-2020 Tue 21:13
CM Jagan calls and talked to Pilli Subhash Chandrabose
  • పిల్లి సుబాష్ చంద్రబోస్ కు భార్యావియోగం
  • చికిత్స పొందుతూ మృతిచెందిన పిల్లి సత్యనారాయణమ్మ
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్

వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ కు భార్యావియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్... సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించారు. సత్యనారాయణమ్మ హఠాన్మరణం చెందడం పట్ల సీఎం జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బోస్ కు ఫోన్ చేసిన ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. ఈ కష్టసమయం నుంచి త్వరగా కోలుకోవాలని తెలిపారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

పిల్లి సుభాష్ చంద్రబోస్ అర్ధాంగి సత్యనారాయణమ్మ గత కొన్నిరోజులుగా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం నాడు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించారు. ఆమె బ్రెయిన్ స్ట్రోక్ కు గురైనట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.