ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టుకు 10 అంబులెన్సులు అందించిన జీటీవీ తెలుగు యాజమాన్యం... డ్రైవర్ సీట్లో రోజా!

13-10-2020 Tue 20:52
Zee TV Telugu donates ten ambulances to AP Arogya Sri Trust
  • విజయవాడలో అంబులెన్స్ లు అందజేత
  • కార్యక్రమంలో పాల్గొన్న పేర్ని నాని, రోజా
  • అంబులెన్స్ లు ప్రారంభించిన వైసీపీ ప్రజాప్రతినిధులు

ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా వైద్య సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆరోగ్యశ్రీ ట్రస్టుకు జీటీవీ తెలుగు చానల్ యాజమాన్యం 10 నూతన అంబులెన్స్ లను అందించింది. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అంబులెన్స్ లను ఏపీ మంత్రి పేర్ని నాని, ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజా అంబులెన్స్ నడిపి అందరినీ అలరించారు.

రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రయత్నానికి జీటీవీ యాజమాన్యం తనవంతుగా సాయపడుతోందని, ఈ దిశగా అంబులెన్స్ లు ఇవ్వడం సంతోషదాయకమని పేర్కొన్నారు. రోజా మాట్లాడుతూ, దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని కొనియాడారు.