స్పోర్ట్స్ డ్రెస్సులో వెంకయ్యనాయుడు వాకింగ్... ఫొటోలు ఇవిగో'!

13-10-2020 Tue 18:55
Venkaiah Naidu walking photos
  • కరోనా నుంచి కోలుకున్న భారత ఉపరాష్ట్రపతి
  • వెంకయ్యనాయుడుకు నిన్న కరోనా నెగెటివ్
  • ఫిట్ నెస్, దేశీయ ఆహారంతో త్వరగా కోలుకున్నానని వెంకయ్య వెల్లడి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఎయిమ్స్ బృందం నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆయనకు నెగెటివ్ వచ్చింది. ఈ క్రమంలో వైద్యులు చెప్పిన జాగ్రత్తలను పాటించాలని వెంకయ్యనాయుడు నిర్ణయించుకున్నారు. తాజాగా, ఉపరాష్ట్రపతి ట్విట్టర్ అకౌంట్ లో ఆసక్తికర ఫొటోలు దర్శనమిచ్చాయి. ఎప్పుడూ తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో కనిపించే వెంకయ్యనాయుడు తాజాగా జాగింగ్ డ్రెస్ ధరించి వాకింగ్ చేస్తూ కనిపించారు. ముఖానికి మాస్కు ధరించిన వెంకయ్య ఢిల్లీలోని తన అధికారిక నివాసం ఆవరణలో వాకింగ్ ట్రాక్ పై నడక సాగించారు.

దీనిపై ఆయన స్పందిస్తూ, కరోనా వైరస్ ప్రభావం నుంచి తాను త్వరగా కోలుకోవడానికి ఫిజికల్ ఫిట్ నెస్, మానసిక బలంతో పాటు దేశీయ ఆహారం ఎంతో ఉపయోగపడ్డాయని వివరించారు. డాక్టర్ల సూచనను కచ్చితంగా పాటించి, త్వరగా ఆరోగ్యం సంతరించుకున్నానని తెలిపారు.